- Step 1
అటుకులూ, బియ్యం, మినప్పప్పును మూడుగంటల ముందు నానబెట్టుకోవాలి.
- Step 2
తరవాత మెత్తగా రుబ్బుకుని తగినంత ఉప్పు వేసుకుని కలిపి పెట్టుకోవాలి.
- Step 3
ఈ పిండిని ఎనిమిది గంటలసేపు నానబెట్టి తరవాత వూతప్పంలా వేసుకోవచ్చు.
- Step 4
నాన్‌స్టిక్ పాన్‌మీద ఈ పిండిని మందంగా పరచుకుని దానిమీద కాసిని సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలూ, స్వీట్‌కార్న్ గింజలు కొద్దిగా చల్లి, నూనె వేసి మూత పెట్టేయాలి.
- Step 5
ఈలోగా మిగిలిన ఉల్లిపాయ ముక్కలూ, జీలకర్రా, కొద్దిగా ఉప్పూ, కారం మిక్సీ జార్‌లో తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 6
సగం ఉడికిన వూతప్పంపై ఈ కారాన్ని కొద్దిగా రాసి.. మళ్లీ మూత పెట్టేయాలి.
- Step 7
ఇది పూర్తిగా ఉడికాక తీసుకుంటే చాలు. మిగిలిన పిండిని కూడా ఇలాగే వూతప్పంలా వేసుకుని.. పైన కారం చల్లితే చాలు.