- Step 1
ముందుగా నూనె లేకుండా సేమ్యాను వేయించాలి. తరువాత మరిగించిన నీళ్లలో సేమ్యా వేసి ఉడికించాలి.
- Step 2
దీన్ని మరిన్ని నీళ్లతో కడిగి చల్లని నీళ్లలో వేసి కాసేపు పక్కన ఉంచాలి. పెరుగులో పాలు కలపాలి. ఆపై క్యారెట్ తురుము, కీరా ముక్కలు, ఉప్పు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి.
- Step 3
బాణలిలో నెయ్యి వేసి ఎండుద్రాక్ష, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు చేసి పెరుగులో కలపాలి.
- Step 4
విడిగా నీళ్లలో వేసి ఉంచిన సేమ్యా కూడా పెరుగులో వేసి, కొత్తిమీర చల్లి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా అందించాలి.
- Step 5
ఇష్టమైతే పోపులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు.
- Step 6
అంతే సేమ్యా పెరుగు తయార్..! దీనిని చిన్నారులు ఎంతో ఇష్టంగా తింటారు.