- Step 1
పనీర్ తురుములో మైదా, పాలమీగడ, జామూన్ మిక్స్, యాలకుల పొడి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలపాలి.
- Step 2
ఈ మిశ్రమాన్ని అరగంట నానబెట్టుకోవాలి. పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి లేతపాకం పట్టి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
నానబెట్టుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీలా వత్తుకోవాలి.
- Step 4
సన్నగా పొడవు ముక్కలు కోసుకుని గుండ్రంగా చుట్టుకోవాలి.
- Step 5
వీటిపై ఒకసారి అప్పడాల కర్రతో కొద్దిగా వత్తి కాగిన నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- Step 6
వెంటనే పంచదార పాకంలో వేసి మూడు నిమిషాలు వుంచి తియ్యాలి.
- Step 7
తర్వాత పంచదార పొడిలో దొర్లించి తియ్యాలి. పంచదార పాకం ఎంత బాగా పడితే కాజాలు అంత రుచిగా ఉంటాయి. వారం రోజులు నిల్వ వుంటాయి కూడా.