- Step 1
ముందుగా ఒక గిన్నెలోకి శెనగపిండి, మైదా పిండిని తీసుకొని రెండింటినీ బాగా మిక్స్ చేయాలి.
- Step 2
ఇప్పుడు ఒక సాస్ పాన్ లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.
- Step 3
అందులో శెనగపిండి, మైదాపిండి మిశ్రమాన్ని వేసి, తక్కువ మంట మీద వేయించుకోవాలి.
- Step 4
పిండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి.
- Step 5
పిండి చల్లారేంతలోపు పంచదార పాకం(సుగర్ సిరప్)తయారు చేసుకోవాలి.
- Step 6
రెండు కప్పుళ నీళ్ళు, పాలు, పంచాదార వేసి తక్కువ మంటమీద పంచదార పాకం చిక్కబడేంత వరకూ కలుపుతూ సిరప్ ను తయారు చేసుకొంటాం.
- Step 7
ఇప్పుడు అందులో వేయించి పెట్టుకొన్న పిండిని పోసి, సన్నిని ఒక గరిటతో బాగా మిక్స్ చేయాలి.
- Step 8
మిక్స్ చేయంగా ఈ మిశ్రం దారం వంటి రేకులను(పోగుపోగుగా) ఏర్పరుస్తూ గట్టిపడుతుంది.
- Step 9
ఈ మిశ్రమాన్ని ఒక ఇంచ్ మంద ఉన్న గిన్నె లేదా ప్లేట్ పోసి, ఆ వేడి మీదనే యాలకుల పొడి, బాదం, గుమ్మడి, కర్బూజ గింజలను గార్నిష్ చేసుకోవాలి.
- Step 10
ఈ పదార్థాం చల్లబడిన తర్వాత చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. అంతే సోన్ పప్పిడి రెడీ.