- Step 1
ఒక పాత్రలో కోవా పొడి, పంచదార వేసి స్టౌ మీద ఉంచి ముద్దలా అయ్యేవరకు కలిపి, దించి చల్లారాక ఈ మిశ్రమాన్ని రెండు ఉండలుగా (ఒకటి పెద్దది, ఒకటి చిన్నది) చేసి పక్కన ఉంచాలి.
- Step 2
బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి కరిగాక, నానబెట్టి ఉంచుకున్న ఖర్జూరాలు వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు కలపాలి.
- Step 3
ఏలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపి దించేయాలి.
- Step 4
ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని దాని మీద కొద్దిగా నూనె పూయాలి.
- Step 5
ఐదు అంగుళాల వెడల్పు, ఒక అంగుళం లోతు ఉన్న డబ్బా మూత తీసుకుని, అందులో ప్లాస్టిక్ షీట్ ఉంచాలి.
- Step 6
తయారుచేసి ఉంచుకున్న కోవా పెద్ద బాల్ తీసుకుని మూత మధ్యలో ఉంచి, చేతితో జాగ్రత్తగా అంచులు కూడా మూసుకునేలా ఒత్తాలి.
- Step 7
ఇప్పుడు కోవా మిశ్రమం మీద ఖర్జూరం మిశ్రమం ఉంచి, ఆ పైన చిన్న బాల్ పెట్టి గట్టిగా ఒత్తి పైన సిల్వర్ ఫాయిల్ ఉంచి, ఫ్రిజ్ లో పది నిమిషాలు ఉంచి తీసేయాలి ఎనిమిది సమాన భాగాలుగా కట్ చేసి అందించాలి.