- Step 1
మష్రూమ్స్ ని కట్ చేసుకుని పెట్టుకోవాలి.
- Step 2
మిక్సీలో అల్లం, వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 3
కడాయ్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకొన్న పేస్ట్ ను వేసి, మీడయం మంట మీద వేయించుకోవాలి.
- Step 4
. ఇప్పుడు అందులో క్యాప్సికమ్, టమోటో ముక్కలు మరియు ఉప్పు వేసి మీడయం మంట మీద రెండు నిముషాలు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు, కారం చిలకరించి బాగా మిక్స్ చేయాలి.
- Step 5
ఇప్పుడు అందులో నీళ్ళు పోసి మిక్స్ చేసి, ఒక నిముషం ఉడికిన తర్వాత అందులో కట్ చేసుకొన్న మష్రుమ్ పుట్టగొడుగులను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని గ్రేవీ చిక్క బడే వరకూ, ముష్రుమ్ మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.
- Step 6
చివరగా గరం మసాలా వేసి మిక్ంస్ చేసి, ఒక నిముషం తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకోవాలి. అంతే కడీ మష్రుమ్ రెడీ.