- Step 1
మైదాపిండిలో కొద్దిగా ఉప్పు కలిపి రెండు టేబుల్‌స్పూన్ల నూనె, తగినన్ని నీళ్లు కలిపి ముద్దలా చేయాలి.
- Step 2
ఎండు ఖర్జూరాల్ని దంచి అందులోని గింజల్ని తీసేసి తరువాత ఖర్జూరాల్ని మిక్సీలో వేసి కాస్త కచ్చాపచ్చాగా చేయాలి.
- Step 3
వేరుసెనగపప్పును వేయించాలి. వీటిని జీడిపప్పు, శనగపప్పుతో కలిపి పొడి చేయాలి.
- Step 4
ఈ పొడిలోనే కిస్‌మిస్, యాలకులపొడి, కొబ్బరి తురుము అన్నీ కలపాలి.
- Step 5
మైదాపిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తాలి.
- Step 6
అందులో డ్రైఫ్రూట్ మిశ్రమాన్ని పెట్టి రెండువైపులా మూసేసి, కజ్జికాయలా వత్తాలి.
- Step 7
ఇప్పుడు వీటిని నాలుగైదు చొప్పున నూనెలో వేయించి తీసేయాలి.
- Step 8
వీటిలో పంచదార ఉండదు కాబట్టి, మధుమేహ రోగులు కూడా చక్కగా తినవచ్చు.