- Step 1
ఒక పాత్రలో మైదాపిండి వేసి, తగినంత నీరు జత చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
- Step 2
పైన నూనె వేసి బాగాకలిపి సుమారు రెండు గంటలసేపు నాననివ్వాలి .
- Step 3
ఒక పాత్రలో శనగపప్పు, తగినంత నీరు పోసి పప్పు ఉడి కించి పక్కన ఉంచాలి.
- Step 4
బాణలిలో నెయ్యి వేసి కరిగాక గుమ్మడికాయ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి .
- Step 5
బెల్లం తురుము, ఏలకుల పొడి జతచేసి బాగా గట్టిపడేవరకు ఉంచి దించేయాలి.
- Step 6
ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని పక్కన ఉంచాలి.
- Step 7
మైదాను చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో వుండను ఒత్తి, మధ్యలో పూర్ణం ఉంచాలి .
- Step 8
ప్లాస్టిక్ కవర్‌కి నూనె రాసి, ఈ ఉండను దాని మీద ఉంచి, చేతితో పల్చగా ఒత్తాలి.
- Step 9
స్టౌ మీద పెనం ఉంచి, తయారుచేసి ఉంచుకున్న బొబ్బట్టును దాని మీద వేసి రెండు వైపులా కాల్చి తీసేయాలి.