- Step 1
మైదాలో డాల్డా వేసి, నీళ్లు పోసి మెత్తటి ముద్దలా కలిపి పక్కనుంచాలి.
- Step 2
కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేయించి, తీసి పక్కనపెట్టాలి.
- Step 3
అదే పాన్‌లో మరికొంత నెయ్యి వేసి రవ్వ వేయించి, అందులో డ్రైఫ్రూట్స్ కలపాలి.
- Step 4
దాంట్లో పంచదార, నీళ్లు పోసి ఉడికించాలి. కడాయిలో నూనె పోసి, వేడి చేయాలి.
- Step 5
కొద్దిగా మైదా ముద్దను తీసుకొని, వెడల్పుగా అదిమి, మధ్యలో రవ్వ మిశ్రమాన్ని పెట్టి (బొబ్బట్లలాగా చేసుకోవాలి) లోపలి మిశ్రమం కనిపించకుండా చివరలు మూసేయాలి.
- Step 6
ఇలా చేసుకున్న ఉండను, అరచేతిలో పెట్టి, కొద్దిగా ఒత్తి, కాగిన నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించాలి.