- Step 1
ఒక కప్పు గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచుకోవాలి.
- Step 2
మిగిలిన పాలను బాణలిలో పోసి మరగనివ్వాలి, మరిగిన తర్వాత పంచదార, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి పాలు నాలుగో వంతు ఇంకే వరకూమరిగించాలి.
- Step 3
మరొక పాత్ర (అడుగు భాగం మందంగా ఉండేది) తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి కిస్‌మిస్, బాదం, చిరోంజి, పిస్తా, మెలన్ గింజలను వేయిం చి పక్కకు పెట్టుకోవాలి.
- Step 4
మిగిలి న నేతిలో సేమ్యాలను దోరగా వేయించుకొని ఇదివరకు మరింగించి పెట్టుకున్న పాలను పోసి ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతుండగా కర్జూరం, కుంకు మపువ్వు కలిపిన పాలను పోసి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడింకించాలి.
- Step 5
సేమియా బాగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి, దీనిని వేడిగా అయినా వడ్డించుకోవచ్చు లేదా ఫ్రిజ్‌లో పెట్టుకొని చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు.