- Step 1
ముందుగా కుక్కర్ లో పప్పును ఉడికించుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలో బంగాళదుంప, క్యారెట్, ఉల్లిముక్కలు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
- Step 2
పాన్ లో ఒక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరి తురుము ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 3
ఇప్పడు చింతపండు రసం, ఉప్పు వేసి ఐదు నిముషాలు మరిగించాలి. ఉడికించి మెత్తగా చేసుకున్న కందిపప్పు, కూరగాయల ముక్కలు, మసాలా పేస్ట్, బెల్లం తురుము వేసి కలపాలి తగినంత నీరు జత చేసి, మంట తగ్గించి 15 నిముషాలు ఉంచి దించేయాలి.
- Step 4
పాన్‌లో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక అందులో ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించి, సాంబార్‌లో వేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే ఉడిపి సాంబార్ రెడీ.