- Step 1
నీటిని మరిగించి, కడిగిన పెసరపప్పును వేసి బాగా ఉడికించి నీరు వార్చి ఐదు నిమిషాలపాటు ఆరబెట్టాలి.
- Step 2
పెసరపప్పుకు పంచదార, యాలకుల పొడి కలిపి మరీ జారుగా లేదా మరీ గట్టిగా కాకుండా రుబ్బి, ఫ్రిజ్‌లో పది నిమిషాలుంచాలి.
- Step 3
మైదాపిండిలో ఉప్పు, వంటసోడా, కరిగించిన నెయ్యి లేదా నూనె కలిపి పూరీల పిండిలాగా కలుపుకోవాలి. ప్రిజ్‌లోంచి పెసరపప్పు మిశ్రమాన్ని తీసి నచ్చిన సైజుల్లో ఉండలుగా చేసి ఉంచాలి.
- Step 4
పూరీల పీటమీద పిండి చల్లి మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా తీసి పూరీల్లా వత్తాలి.
- Step 5
ఇప్పుడా పూరీలలో పెసరముద్దను ఉంచి కొసలు మూసివేసి మెల్లిగా చపాతీలాగా చేయాలి.
- Step 6
అలా మొత్తం చేసుకున్నాక.. పెనంపై నూనె లేదా నెయ్యి వేసి ఒక్కోదాన్ని రెండువైపులా ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి పెసర బొబ్బట్లు తయార్..!