- Step 1
చక్కెరను మెత్తగా పొడిలా చేసుకోవాలి. మైదా పిండిని జల్లించుకోవాలి.
- Step 2
ఒక గిన్నె తీసుకుని అందులో గుడ్లు పగులగొట్టి తెల్లసోనాను మాత్రం తీసుకోవాలి. దీనిని ఎగ్ బీటర్తో కానీ గ్రైండర్‌లో కానీ వేసి బాగా కలపాలి. మైదాను రాత్రి పూటకానీ పొద్దు నకానీ తడిపి బాగా మృదువుగా అయ్యేలా కలుపుకోవాలి.
- Step 3
ఉదయం చేసేట్లు అయితే పిండిని ముందు రోజు రాత్రి, సాయంత్రం చేసుకోవాలనుకుంటే ఉదయంపూట పిండిని తడిపి వుంచుకోవా లి.
- Step 4
అలా చేస్తేనే బిస్కెట్స్ గుల్లగా వుండి కరకరలాడుతుంటాయి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో కోడి గుడ్డును పగుల గొట్టి వేయాలి.
- Step 5
దానిలో చక్కెర పొడిని వేసి బాగా కలియబెట్టాలి. మైదాపిండిలో బేకింగ్ సోడా, వెన్న వేసి కలపాలి.
- Step 6
తరువాత గుడ్డు సోనాలో పైనాపిల్ ఎస్సెన్సు వేసి బాగా బ్లెండ్ చేసి దీన్ని మైదా పిండిలో వేసి కలపాలి.
- Step 7
చక్కెర మిశ్రమంలో దీన్నంతటిని వేసి బాగా కలుపుకోవాలి.
- Step 8
దీన్ని నాలుగు లేదాఐదు గంటల పాటుపక్కన వుంచుకోవాలి. తరువాత వాటిని పూరీల్లా వత్తుకోవాలి.
- Step 9
వీటిని నచ్చిన ఆకారంలో ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కేక్ పాన్ తీసుకుని అందులో ప్రత్యేకంగా వుండే గిన్నెలో బిస్కెట్స్‌ను పెట్టి బేక్ చేయాలి.
- Step 10
లేత బంగారు రంగు వచ్చే వరకు అలా వుంచేయాలి. పైనాపిల్ బిస్కెట్స్ రెడీ.