- Step 1
ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి దానిని ఉప్పు వేసి ఉడికించుకుని గ్రైండ్ చేసుకోవాలి.
- Step 2
స్టవ్ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడి చేయాలి . నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, రెడ్ చిల్లీ వేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో గార్లిక్ వేసి, మరో కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి
- Step 3
ఇప్పుడు అందులో టమాటో కూడా వేసి మరో నిముషం ఉడికించుకోవాలి. తర్వాత అందులో ధనియాలపొడి, కారం, మరియు గరం మసాలా పౌడర్ వేసి వేగించుకోవాలి
- Step 4
ఇప్పుడు అందులో ఒక కప్పు నీళ్ళు పోసి, 5నిముషాలు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. .
- Step 5
ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఉల్లిపాయ పేస్ట్ వేసి, వేడిచేసి ఆకుకూర పేస్ట్ మరియు కప్పు నీళ్ళు కూడా వేసి 2,3 నిముషాలు ఉడికించుకోవాలి.
- Step 6
తర్వాత అందులోనే ముందుగా ఉడికించుకొన్న కార్న్ మరియు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరో 3,4 నిముషాలు ఉడికించుకోవాలి.
- Step 7
ఇప్పుడు అందులో నిమ్మరసం వేసి, బాగా మిక్స్ చేసి, సర్వింగ్ బౌల్లోనికి తీసుకుని చేసుకోవాలి చివరగా ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి.రుచికరమైన పాలక్ కార్న్ కర్రీ రెడీ .