- Step 1
గోధుమలను నీటిలో రెండు గంటలు నానబెట్టాలి మినప్పప్పును నీటిలో అర గంట నానబెట్టాలి.
- Step 2
గోధుమలను మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి .
- Step 3
ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి, గోధుమరవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి ఆరు గంటలపాటు నాననివ్వాలి.
- Step 4
బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.
- Step 5
క్యారట్ తురుము, బీన్స్ తరుగు వేసి ఐదారు నిముషాలు ఉంచి తీసేయాలి.
- Step 6
నానబెట్టిన పిండిలో వీటిని కలిపి పెరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి.
- Step 7
ఇడ్లీ రేకులలో వేసి కుకర్‌లో ఉంచి విజిల్ లేకుండా ఉడికించాలి.