- Step 1
ముందుగా ఎర్ర పప్పు కడిగి నానపెట్టుకోవాలి.
- Step 2
పాన్ లో ఎర్రపప్పు వేసి అందులో ఉల్లిపాయముక్కలు, లవంగాలు వేసి వేయించుకోవాలి.
- Step 3
అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్, జీలకర్ర, పసుపు వేసి మరికాసేపు వేగనివ్వాలి.
- Step 4
వేగుతున్న మిశ్రమంలో ముందుగా నానపెట్టుకున్న ఎర్రపప్పు వేసి 1 నిమిషంపాటు వేయించుకోవాలి.
- Step 5
తర్వాత అందలో కోకోనట్ మిల్క్, వెజిటేబుల్ స్టాక్ కూడా వేసి, బాగా మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా నీళ్ళు కూడా వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి.
- Step 6
అందులో టమాటో ముక్కలు కూడా వేసి, ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా మిక్స్ చేసి, మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.
- Step 7
తర్వాత అందులో బీరకాయ ముక్కలు కూడా వేసి, మెత్తగా ఉడకించుకోవాలి. ఇప్పుడు పప్పు, బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికి, కర్రీ చిక్కబడే సమయం చూసి, స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, క్రిందికి దింపుకొని సర్వ్ చేయాలి. అంతే క్రీమీ కోకనట్ దాల్ రిసిపి చాలా రుచికరంగా ఉంటుంది.