- Step 1
ముందుగా తురిమి పెట్టుకున్న ఆలు, ఉల్లిపాయలను కలిపి విడిగా పెట్టుకోవాలి.
- Step 2
ఆలూను తురిమిన వెంటనే నీళ్ళలో వేస్తే రంగు మారదు. తర్వాత మైదా, ఉప్పు, మిరియాల పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాలను కలుపుకోవాలి.
- Step 3
అందులో కలిపి పెట్టుకున్న ఆలు, ఉల్లి తురుమును కలిపి అందులో జారుగా వచ్చేలా తగినన్ని నీళ్ళు కానీ పాలు కానీ పోసి కలుపుకోవాలి.
- Step 4
ఎక్కువ నీరు పోయడం మంచిది కాదు. ఎందుకంటే ఆలు, ఉల్లిపాయ కూడా నీటిని విడుదల చేస్తాయి.
- Step 5
గరిట జారుగా కలుపుకున్న పిండిని ఎక్కువగా కలపకుండా ఉంటేనే మంచిది.
- Step 6
తర్వాత పొయ్యి మీద తావను పెట్టి వేడెక్కిన తరువాత దానిపై కాస్త నూనె పోసి తావ అంతా అంటేలా గరిటతో తిప్పాలి.
- Step 7
తర్వాత ఒక కపెద్ద గరిటెడు పిండిని తీసుకుని దోశలకు పోసినట్టుగా పోయాలి.
- Step 8
అయితే ఇది పల్చగా మాత్రం ఉండకూడదు. ఎంత పెద్దది, ఎంత చిన్నది వేయాలనేది మన ఇష్టం. రెండు నిమిషాలపాటు దానిని ఉడకనిచ్చి రెండో వైపుకి తిప్పాలి.
- Step 9
ఆ వైపు కూడా అలాగే కాలే దాకా ఉంచాలి. దీనిని టమేటో కెచప్‌తో కానీ జామ్‌తో కానీ చట్నీతో కానీ దేనితోనైనా తినవచ్చు. కొబ్బరి చట్నీ అయితే కొందరు లొట్టలేస్తారు.