- Step 1
ముందుగా ఆవుపాలను బాగా వేడి చేసి పక్కనుంచుకోవాలి.
- Step 2
ఒక గిన్నెలో కొద్దిగా నీరు, వెనిగర్ వేసి బాగా కలుపుకుని దానిని వేడి పాలలో వేస్తే పాలు విరుగుతాయి.
- Step 3
అప్పుడు విరుగులోని నీళ్లను పిండేసి మిగిలిన ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఒక పాన్ తీసుకుని అందులో అరకేజీ పంచదార, టీస్పూను నీరు పోసి కరిగించాలి.
- Step 5
అందులో ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఉండల (చంచం) ను వేసి ఉడికించి వాటిని పక్కన పెట్టాలి.
- Step 6
ఇంకొక బాణలి తీసుకుని అందులో గేదెపాలు పోసి మరిగిన తరవాత అందులో 250 గ్రా. పంచదార, వంటసోడా వేసి బాగా కలపాలి.
- Step 7
అది మొత్తం కోవాలా తయారయిన తరువాత మంట మీద నుంచి కిందకు దింపి చల్లార్చాలి.
- Step 8
ముందుగా తయారుచేసుకున్న చమ్-చమ్‌ల మీద ఈ మిశ్రమాన్ని వేసి, పైన పిస్తా, జీడిపప్పు, చెర్రీలతో గార్నిష్ చే సి సర్వ్ చేయాలి. అంతే స్వీట్ చమ్ - చమ్ రెడీ