- Step 1
మైదా పిండిలో ఉప్పు, మూడు చెంచాల పంచదార, పాలు చేర్చి చపాతీ పిండికన్నా కాస్త పల్చగా కలిపి గంటసేపు నానబెట్టాలి.
- Step 2
బాణలిలో రెండుచెంచాల నెయ్యి వేడిచేసి బీట్‌రూట్, క్యారెట్ తురుములను పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
- Step 3
దాన్లో మామిడి తురుము కూడా చేర్చి మరికాసేపు వేగనివ్వాలి.
- Step 4
పదినిమిషాలయ్యాక పంచదార, అరకప్పు నీరుచేర్చి ఉడికించాలి.
- Step 5
బాగా ఉడికి దగ్గరపడ్డాక పచ్చికోవా, యాలకుల పొడి చేర్చి స్టౌ కట్టేయాలి.
- Step 6
ఇప్పుడు మైదా పిండిని చిన్న ఉండల్లా చేసుకోవాలి.
- Step 7
ఒక ఉండను తీసుకుని పాలిథీన్ కవరుపై నూనె అద్దుతూ చేత్తో చిన్న పూరీలా వత్తాలి.
- Step 8
ఇందులో మామిడికాయ మిశ్రమాన్ని రెండుచెంచాలుంచి.. చుట్టూ మూసి.. మళ్లీ వత్తాలి.
- Step 9
పెనంపై రెండుచెంచాల నూనె వేడిచేసి ఒక్కో బొబ్బట్టునూ రెండువైపులా దోరగా కాలిస్తే సరి.