- Step 1
ఒక పెద్ద గిన్నెను స్టౌ మీద పెట్టి, నెయ్యి వేసి వేడి చేయాలి.
- Step 2
అందులో సేమ్యా వేసి సన్నని మంట మీద ముదురు గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించాలి.
- Step 3
గిన్నెలో నుంచి సేమ్యాని మరొక పాత్రలోకి తీసుకోవాలి. సేమ్యా వేయించిన గిన్నెలోనే పాలు పోసి మరిగించాలి.
- Step 4
బియ్యప్పిండిలో కొద్దిగా చల్లని పాలు కలిపిన మిశ్రమాన్ని, పంచదార, ఏలకుల పొడి... వీటిని మరుగుతున్న పాలలో పోసి కలిపి, సన్నని మంట మీద ఉడికించాలి.
- Step 5
అందులో తరిగిన ఖర్జూరం, బాదంపప్పు, కిస్‌మిస్, పిస్తాపప్పు, కొబ్బరి ముక్కలు వేసి కలపాలి.
- Step 6
సేమ్యా వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉంచి, తీయాలి.