- Step 1
ముందుగా బాస్మతి బియ్యాన్ని చిటికెడు నెయ్యిలో వేయించి పిండి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఒక పాత్రలో పాలు పోసి అవి మరుగుతున్నప్పుడు బియ్యం పిండిని నీళ్లలో కలిపి పేస్టులా చేసి గరిటెతో కలుపుతూ ఆ పాలల్లో పోయాలి.
- Step 3
అలాగే మొక్కజొన్న పిండిని కూడా పేస్టులా చేసి అందులో పోయాలి.
- Step 4
దాంతోపాటు సొరకాయ తురుమును కాస్త ఉడికించి పాలల్లో వేయాలి.
- Step 5
తర్వాత చక్కెర వేసి కాస్త చల్లారిన తర్వాత కోవా, మిల్క్ మెయిడ్, గ్రీన్ కలర్‌లను వేసి బాగా కలపాలి.
- Step 6
చివరగా జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్షలను నెయ్యిలో దోరగా వేయించి నెయ్యితో పాటు పాయసంలో పోసి ఒక అరగంట డీప్ ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేస్తే చాలా మధురంగా ఉంటుంది.
- Step 7
ఈ పాయసం ఫ్రిజ్‌లో వారం, పది రోజుల పాటు నిల్వ ఉంటుంది.