- Step 1
పెసరపప్పును కడిగి మూడుగంటల సేపు వేడినీటిలో నానబెట్టాలి.
- Step 2
తర్వాత నీటిని వంపేసి క్లాత్ మీద వేసి తడిపోయేటట్లు చేయాలి.
- Step 3
ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి సన్నమంట మీద నానిన పెసరపప్పును వేయించాలి.
- Step 4
దోరగా వేగిన తర్వాత దించేసి, పూర్తిగా చల్లారిన తర్వాత తగినంత నీటిని చేర్చి మెత్తగా గ్రైండ్ చేయాలి.
- Step 5
బాణలిలో మిగిలిన నేతిలో పెసరపప్పు పేస్ట్, చక్కెర వేసి సన్నమంట మీద ఉడికించాలి.
- Step 6
చక్కెర కరిగిన తరవాత కుంకుమపువ్వు వేయాలి.
- Step 7
మిశ్రమం బాణలికి అతుక్కోకుండా దగ్గరయ్యే వరకు కలుపుతూ ఉండాలి.
- Step 8
ఇప్పుడు కోవా, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించాలి.
- Step 9
ఒక ట్రేకి నెయ్యిరాసి బర్ఫీ మిశ్రమాన్ని వేసి సమంగా సర్ది పైన సిల్వర్ పేపర్‌ను అతికించాలి.
- Step 10
వేడి తగ్గిన తర్వాత మనకు కావల్సిన ఆకారంలో కట్ చేయాలి. సిల్వర్ పేపర్ అతికించకుండా పైన డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయవచ్చు.