- Step 1
ముందుగా క్యాబేజీ, క్యారెట్, మల్లంగి, బీట్‌రూట్‌లను సన్నగా తురుము కోవాలి.
- Step 2
వీటిని కుక్కర్‌లో వేసి కొద్దిగా నీరు, ఉప్పు వేసి ఉడికించుకో వాలి. ఉడికిన తరువాత అందులో వున్న నీటిని వార్చుకోవాలి.
- Step 3
పెనంపెట్టి వేడయ్యాక కొద్దిగా నూనె వేసుకోవాలి. పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు వేసుకుని వేపుకోవాలి.
- Step 4
వేగిన తరువాత ఇందులో ఉడికించుకున్న కూరగాయలు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి.
- Step 5
పది నిమిషాలు మగ్గనివ్వాలి. దించుకునే ముందు కొద్దిగా చాట్ మసాలా, కొత్తిమీర వేసుకోవాలి.
- Step 6
నిమ్మరసం పిండుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మంచిది.