- Step 1
ముందుగా వేడినీటిలో పాలకూర ఆకుల్ని వేసి తీసేయాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.
- Step 2
అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కల్ని వేసి బాగా మగ్గించాలి. దీనికి ఉల్లిపాయ ముక్కలు, పసుపు చేర్చి మరికాసేపు సన్నని మంటపై ఉంచాలి.
- Step 3
చివర్లో ఉప్పు, సేమియా, కొత్తమీర కలిపి పాత్రను దించేయాలి. ఈ మిశ్రమాన్ని పాలకూర ఆకుల్లో ఒక్కో టీస్పూన్ చొప్పున ఉంచి గుండ్రంగా చుట్టి ఉంచాలి.
- Step 4
ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి చుట్టి ఉంచిన పాలకూర ఆకుల్ని ఉంచి నిమిషంపాటు రెండువైపులా వేయించి తీసేయాలి.
- Step 5
అంతే వేడి వేడి మసాలా పాలక్ కర్రీ రోల్స్ తయారైనట్లే. ఇవి చపాతీలతోనూ, అన్నంతోనూ కలిపి తినేందుకు చాలా రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.