- Step 1
మొక్కజొన్న, పచ్చిమిర్చి, అల్లం కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- Step 2
ఈ మిశ్రమంలో బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. దీనిని ఒక పళ్లెంలో సమానంగా పరిచి దానిని కుకర్‌లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
- Step 3
ఇది పూర్తిగా చల్లారాక చిదిపి పొడిపొడిగా వచ్చేలా చేయాలి.
- Step 4
ఒక బాణలిలో 50 గ్రా. నూనె వేసి కాగాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరవాత ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి ఐదు నిముషాలు వేయించాలి.
- Step 5
ఇవన్నీ బాగా వేగిన తరవాత, ఉడికించి చిదిపిన మొక్కజొన్న మిశ్రమం, ఉప్పు, పసుపు, కారం కూడా వేసి రెండు మూడు నిముషాలు బాగా వేయించి దింపేయాలి.
- Step 6
దీనిని వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.