- Step 1
బాణలిలో కొంచెం నూనె వేడిచేసి పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి.
- Step 2
బంగాళదుంపలను మెత్తగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి.
- Step 3
బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో మొక్కజొన్న గింజలు వేసి కొద్దిగా వేగిన తరవాత ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి మరో రెండు నిముషాలు వేయించి, దింపి చల్లారనివ్వాలి.
- Step 4
విడివిడిగా తయారుచేసి పెట్టుకున్న పై పదార్థాలనన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలిసేలా కలపాలి.
- Step 5
మెత్తగా అయిన ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 6
ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, కొంచెం నీళ్లు పోసి బజ్జీలపిండిలా జారుగా కలుపుకోవాలి.
- Step 7
ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలను ఈ పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి.