- Step 1
టమాటోలు ఉడికించి చిక్కటి గుజ్జు తీయాలి.
- Step 2
బాణలిలో నెయ్యి పోసి జీడిపప్పు, బాదంపప్పు వేయించుకోవాలి.
- Step 3
అదే బాణలిలో బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించాలి.
- Step 4
వేరే గిన్నేలో రెండు కప్పుల నీరు పోసి మరిగించి, వేయించిన బొంబాయి రవ్వను కలపాలి.
- Step 5
ఇది ఉడికిన తరువాత టొమాటో గుజ్జు, పంచదార, జీడిపప్పు, బాదంపప్పు, నెయ్యి వేసి కలియబెట్టాలి.
- Step 6
చివరగా యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపాలి.
- Step 7
దీనిని నెయ్యి రాసిన ప్లేట్ కి తీసుకోని చల్లారిన తరువాత మనకు కావలసిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే రుచికరమైన టొమోటో హల్వా రేడి.