- Step 1
పై మూడింటిని శుభ్రంగా కడిగి కనీసం ఆరు గంటల సేపు నానబెట్టి గ్రైండ్ చేయాలి.
- Step 2
ఆ మిశ్రమానికి ఉప్పు కలిపి రాత్రంతా అలాగే ఉంచితే ఉదయానికి పిండి గుల్లగా పొంగుతుంది.
- Step 3
ముందుగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలను ఒకగిన్నెలో వేసి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.
- Step 4
తరవాత ఆ మిశ్రమాన్ని నూనెలో వేసి వేగాక క్యాప్సికమ్, టొమాటో ముక్కలను కూడా వేసి ఉడికించాలి.
- Step 5
చివరగా జీరాపొడి, ధనియాలపొడి, మిర్చిపొడి వేసి బాగా కలిపి దించేయాలి.
- Step 6
దోసెను వేసి, దాని చుట్టూ అంచులకు ఎరక్రారాన్ని (ఎండుమిర్చి, తగినంత ఉప్పు, నీరు పోసి గ్రైండ్ చేయాలి) రాసి, మధ్యలో క్యాప్సికమ్ కూరను వేసి, దానిపై వెన్నను పూయాలి. క్యాప్సికమ్ బటర్ దోసె.