- Step 1
ఉప్పు, వాము, డాల్డా మైదాపిండిలో వేసి సరిపడినన్ని నీళ్లుపోసి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసి ముక్కలు కోసుకోవాలి. బఠాణీలు ఉడికించాలి.
- Step 2
బాండీలో కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర తరుగు, బంగాళ దుంప ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి.
- Step 3
తర్వాత ఉడికించిన బఠాణీలు, ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. ఇప్పుడు సమోసాలో పెట్టే కూర రెడీ.
- Step 4
ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండిని నిమ్మకాయ సైజులో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
- Step 5
వీటిని కోడిగుడ్డు ఆకారంలో చపాతీలా రుద్దాలి. దాన్ని సగానికి అడ్డంగా చాకుతో కొయ్యాలి.
- Step 6
ఒక్కో ముక్కను తీసుకుని రెండు చివరలు అతికిస్తే కోన్‌లా (మిఠాయి పొట్లంలా) అవుతుంది.
- Step 7
అందులో బంగాళదుంప కూర నింపి అంచులకు తడి అంటించి మూసెయ్యాలి.
- Step 8
వీటిని కాగిన నూనెలో దోరగా వేయించి తీస్తే చాలు. వేడి వేడి సమోసాలు రెడీ. ఇందులో బంగాళదుంప బదులు క్యారెట్లు, బీన్స్, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు.