- Step 1
గోధుమపిండిలో ఉప్పు వేసి, నీటితో చపాతీ పిండిలా కలుపుకోవాలి.
- Step 2
ప్యాన్‌లో నూనె వేడిచేసి ఉల్లితరుగు, ఉల్లిపరక, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి.
- Step 3
తరవాత తరిగిన క్యాబేజీ, క్యారట్, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి.
- Step 4
ఐదు నిమిషాల తరవాత తడి పోయాక కొత్తిమీర వేసి దింపేయాలి. పిండి బాగా మెత్తగా అయ్యాక చిన్న ఉండలుగా చేసుకుని పలుచగా చపాతీ సైజులో ఒత్తుకోవాలి. *పెనం వేడి చేసి ఈ చపాతీని రెండువైపులా కొద్దిగా వెచ్చబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
చల్లారిన తరవాత చపాతీలను రెండు అంగుళాల వెడల్పులో నిలువుగా రిబ్బనులా కట్ చేసుకోవాలి.
- Step 6
ఒక కొనవైపు కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి త్రికోణంలా మడుస్తూ పోవాలి.
- Step 7
మొత్తం సమోసాని త్రికోణంలా మడిచాక అంచులు తడిచేసి విడిపోకుండా ఒత్తి మూసేయాలి.
- Step 8
వేడినూనెలో వేసి కరకరలాడేలా వేయించాలి.