- Step 1
జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా, వాము వేసి బాగా కలపాలి.
- Step 2
తరవాత అందులో నీరు పోసి చపాతీ పిండిలా కలుపుకుని పక్కన ఉంచాలి. కోవానుపొడిగా చేయాలి.
- Step 3
సన్నగా కట్ చేసుకున్న డ్పైఫ్రూట్స్, సగం ఏలకుల పొడి, కలర్ వేసి కలిపి పెట్టుకోవాలి.
- Step 4
చక్కెరలో పావు కప్పు నీళ్లు పోసి ముదురుపాకం చేసుకుని అందులో మిగిలిన ఏలకుల పొడి కలపాలి.
- Step 5
పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి.
- Step 6
ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి సమోసాలా మడిచి వేడి నూనెలో బంగారురంగు వచ్చేవరకు వేయించాలి.
- Step 7
తరవాత వీటిని పంచదార పాకంలో వేసి అరగంట ఉంచి తీసి సర్వ్ చేయాలి.