- Step 1
జల్లించిన మైదాలో కరిగించిన డాల్డా వేసి బాగా కలపాలి.
- Step 2
తరవాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీలా కలిపి మూత పెట్టాలి. వెడల్పాటి ప్యాన్‌లో రెండు టీ స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లి తరుగు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
- Step 3
తరవాత కూరగాయ ముక్కలు వేసి వేగాక అజినమోటో వేసి కలిపి, ఉడికించిన నూడుల్స్,తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి నీటి త డి పోయేవరకు వేయించి దింపేయాలి.
- Step 4
కలిపి పెట్టుకున్న పిండిలో కొద్దిగా నూనె వేసి మరోమారు కలిపి చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి.
- Step 5
ఒక్కో ఉండను పొడిపిండి అద్దుకుంటూ పలుచగా పూరీలా ఒత్తుకోవాలి.
- Step 6
దీనిని చాకుతో రెండు భాగాలుగా త్రికోణంగా కట్ చేసి, ఒక్కో ముక్క తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు నూడుల్స్ మిశ్రమాన్ని పెట్టి, అంచులు విడిపోకుండా ఒత్తి మూసేయాలి.
- Step 7
వేడినూనెలో ఈ సమోసాలు బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి.