- Step 1
ముందుగా మైదా పిండికి వాము, తగినంత ఉప్పు చేర్చి చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు నానబెట్టాలి. *బాణలిలో కొద్దిగా నెయ్యి వేడిచేసి కొబ్బరి తురుము, నువ్వులను విడి విడిగా వేయించి ఉంచాలి.
- Step 2
నువ్వులు చల్లారిన తరువాత పొడిచేసి ఉంచాలి.
- Step 3
ఇప్పుడు నువ్వులపొడి, కొబ్బరి తురుము, సోంపు, వాము, ధనియాలపొడి, ఇంగువ, కారంపొడిలను ఒక పాత్రలో వేసి బాగా కలియబెట్టాలి.
- Step 4
మైదాను చిన్న చిన్న పూరీల్లా చేసి చాకుతో రెండు భాగాలుగా కోయాలి.
- Step 5
ఒక్కోదాంట్లో పై పొడి మిశ్రమాన్ని మూడు టీస్పూన్లు వేసి నీటితో తడుపుతూ చివర్లు సమోసా షేప్‌లో మూసివేయాలి.
- Step 6
అలా మొత్తం పిండినంతా చేసుకుని బాగా మరుగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి న్యూస్ పేపర్‌పై పరవాలి.
- Step 7
అంతే వేడి వేడి కొబ్బరి సమోసాలు తయార్. వీటిని వేడిగా ఉన్నప్పుడే టొమోటో సాస్ లేదా చింతపండు సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.