- Step 1
మినప్పప్పు ఓ పూట ముందుగా నానబెట్టి ఉంచాలి. బియ్యం కూడా ఓ పూట ముందుగానే కడిగి నానబెట్టి ఉంచి, మినప్పప్పు వేసి కలిపి మెత్తగా రుబ్బాలి.
- Step 2
పచ్చిశెనగపప్పును ఓ గంట ముందుగానే నానబెట్టాలి మరియు రుబ్బుకోవాలి .
- Step 3
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంలను సన్నని ముక్కలుగా కోయాలి.
- Step 4
రుబ్బుకున్న పిండిలో పచ్చిసెనగపప్పు, ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, వంటసోడా వేసి గారెలపిండికన్నా కాస్త మెత్తగా కలపాలి.
- Step 5
మీడియం సైజులో పిండిముద్దను తీసుకుని గుండ్రంగా చేసి నూనెలో వేసి బాగా వేయించాలి.
- Step 6
వీటిని వేడివేడిగా వేరుశెనగ పచ్చడి లేదా ఎర్ర పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
- Step 7
కాస్త పుల్లగా తినాలనుకుంటే పిండిలో అన్నీ వేసి కలిపి ఓ పూట నిల్వ ఉంచితే పిండి పులిసి రుచిగాఉంటాయి.
- Step 8
అయితే అజీర్తి ఉన్నవాళ్లకి పులవకుండా ఉంటేనే మంచిది.