- Step 1
కడాయిలో నెయ్యి వేసి, కరిగాక, అందులో రవ్వ, క్యారట్ తురుము వేసి వేయించాలి.
- Step 2
వేగిన తర్వాత, దాంట్లో పంచదార వేసి ముద్దలా అయ్యేంతవరకు కలిపి, ఏలకుల పొడి వేసి, పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
- Step 3
మైదాను నీళ్లతో తడిపి, పూరీపిండిలా ముద్దలా కలుపుకోవాలి.
- Step 4
పిండి ముద్దను కొద్దిగా తీసుకొని ఉండలా చేసి, వెడల్పుగా చేత్తో అదిమి, అందులో క్యారట్, రవ్వ ముద్దను పెట్టి, అన్నివైపులా మూయాలి.
- Step 5
దీన్ని ఒక కవర్ మీద పెట్టి, చేత్తో పూరీ పరిమాణంలో ఒత్తి, పెనం మీద కొద్దిగా నెయ్యి వేసి, రెండువైపులా కాల్చి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. *కొద్దిగా నెయ్యి వేసి, భక్ష్యాలను వేడి వేడిగా వడ్డించాలి.