- Step 1
మైదాలో నీళ్లు కలిపి పూరీపిండిలా కలిపి పక్కన ఉంచాలి.
- Step 2
సేమ్యాను ఉడికించి, పక్కన ఉంచాలి.
- Step 3
పాన్‌లో నూనె వేసి, కాగాక, ఉల్లిపాయల తరుగు, అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. *తర్వాత మిక్స్‌డ్ వెజిటబుల్స్ వేసి కలిపి, ఉడికించాలి.
- Step 4
బాగా వేగిన తర్వాత ఉప్పు, సేమ్యా వేసి కలపాలి.
- Step 5
పైన మిరియాల పొడి చల్లి, దించాలి. మైదాను చిన్న చిన్న ముద్దలు తీసుకొని, పలచని రోటీ చేయాలి. *దీంట్లో తగినంత సేమ్యా మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ పెట్టి, రోల్ చేసి అన్ని వైపులా మూసేయాలి.
- Step 6
ఇలా అన్నింటిని చేసి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె పోసి, కాగిన తర్వాత రోల్స్‌ని నూనెలో వేసి అన్నివైపులా డీప్ ఫ్రై చేయాలి. *ఈ రోల్స్‌ని ఏదైనా సాస్ లేదా జ్యూస్‌తో సర్వ్ చేయాలి.