- Step 1
ముందుగా స్టౌపై గిన్నెపెట్టి సేమ్యాను నూనె లేకుండా గోధుమరంగు వచ్చే వరకు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
మరొక గిన్నెలో బంగాళదుంప పేస్ట్, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్, వేరుశనగ పప్పులు, జీలకర్ర, కొత్తిమీర, సేమ్యా, నిమ్మరసం.. ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలిపి ఐదునిముషాలు పక్కన పెట్టుకోవాలి.
- Step 3
తర్వాత స్టౌపై కడాయి పెట్టి, నూనె పోసి, కాగనివ్వాలి.
- Step 4
తర్వాత సేమ్యా మిశ్రమాన్ని కావాల్సిన ఆకారంలో చేసుకొని బ్రెడ్ పౌడర్‌లో అటూ ఇటూ డిప్ చేసి నూనెలో వేయించుకోవాలి.
- Step 5
రెడీ అయిన సేమ్యా కట్‌లెట్స్ వేడివేడిగా, కరకరలాడుతూ నోరూరిస్తాయి.