- Step 1
ముందుగా బంగాళదుంపను ఉడికించి తొక్కతీసి మెత్తగా గుజ్జు చేసి పక్కనుంచుకోవాలి.
- Step 2
బాణలిలో తగినంత నీరుపోసి అందులో సేమియా, క్యారట్ తురుము వేసి ఉడికించి పక్కనుంచుకోవాలి.
- Step 3
ఒక గిన్నెలోకి ఉడికించుకున్న పదార్థాలను, ఉప్పు, కారం, ఉల్లితరుగు, బియ్యప్పిండి, గరంమసాలా, కొత్తిమీర వేసి కలిపి ముద్దగా చేయాలి.
- Step 4
ఈ ముద్దను చిన్న ఉండలుగా తీసుకుని నచ్చిన ఆకారంలో తయారు చేసుకోవాలి.
- Step 5
పెనం మీద నూనె వేడయ్యాక కట్‌లెట్‌లను రెండువైపులా బాగా కాల్చుకోవాలి.
- Step 6
సేమియా కట్‌లెట్ టొమాటో సాస్‌తో సర్వ్ చేస్తే బావుంటుంది.