- Step 1
పూర్ణాలు తయారు చేసుకోవడానికి ముందురోజు రాత్రి బియ్యం, మినప్పప్పు నాన పెట్టుకోవాలి.
- Step 2
మరునాడు పూర్ణాలు తయారు చేసుకోవడానికి ఒక అరగంట ముందు బియ్యం, మినప్పప్పు దోసెల పిండిలాగా రుబ్బుకోవాలి. * అలాగే పెసరపప్పును కూడా గంటసేపు నానబెట్టు కోవాలి. తర్వాత పప్పును ఇడ్లీ పిండిలా రుబ్బుకోవాలి.
- Step 3
రుబ్బిన మిశ్రమాన్ని ఇడ్లీ లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 4
బెల్లం పాకాన్ని ముదురు పాకంలాగా చిక్కగా తీసుకోవాలి.
- Step 5
ఇప్పుడు ఇడ్లీలుగా వేసుకున్న ఆ కుడుములను మనం పొడి చేసుకుని అందులో యాలుకుల పొడి, కొబ్బరి, బెల్లం పాకాన్ని వేసి కలుపుకోవాలి.
- Step 6
దానిని ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి.
- Step 7
తరువాత మినప్పప్పు, బియ్యం పిండిలో కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
- Step 8
బాండిలో నూనె కాగిన తరువాత ఆ ఉండలను అ రుబ్బులో ముంచి నూనెలో వేయించుకుంటే పెసరపప్పు పూర్ణాలు తయారైనట్లే.
- Step 9
కొంచెం వేడిగా ఉండగానే అందులో నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.