- Step 1
కాలీఫ్లవర్ పూలను కొద్దిగా కాడతో తుంచుకోవాలి. వాటిని ఉప్పునీటిలో కాని వేడి నీటిలో వేసుకుని పావు గంట సేపు ఉంచాలి. *తర్వాత వాటిని బయటకు తీసి పావు గంట ఆరబెట్టాలి. క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 2
ఉల్లిపాయలను రౌండ్ గాకట్ చేసుకోవాలి. కాప్సికమ్‌ను కూడా చిన్నవిగా పొడవుగా కట్ చేసుకోవాలి.
- Step 3
కార్న్‌ఫ్లోర్ మూడు టీ స్పూన్లు కొంచెం వేడి నీటిలో కలుపుకుని పేస్టులా తయారు చేసుకోవాలి. స్వీట్ పేస్ట్ కొంచెం చేయాలి.
- Step 4
అందులో స్టౌపై పాన్ వుంచి అందులో 2 స్పూన్ల ఆయి ల్ వేసి వేడి చేసి అందులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి అందులో ఈ స్వీట్ పేస్ట్‌ని వేసి కలుపుకోవా లి. కొంచెం ఉప్పు వేసుకోవాలి.
- Step 5
అన్నింటిని సన్నని సెగ మీద వేగనివ్వాలి. పావు గంట తరువాత దించుకుని చల్లారనివ్వాలి. స్వీట్ వెజిటబుల్ పేస్ట్ బజారులో దొరు కుతుంది. అది ఈ మగ్గిన కూరగాయలతో, కార్న్‌ఫ్లోర్ పేస్ట్ వేసి కలపాలి.
- Step 6
మళ్లీ అన్నింటిని కలిపి ఒక గిన్నెలో వేసుకుని మూడు నిమిషాలు మూతపెట్టి ఉడకనివ్వా లి. ఉడికిన తరువాత దించుకుని పైన చెప్పి స్వీట్ పేస్ట్ వేయాలి.
- Step 7
టమోటాకెచప్, చిల్లీసాస్, ఆరెంజ్‌జ్యూస్, పై నాపిల్ జ్యూస్, చింతపండు రసం వీటన్నింటినీ కలిపి ఒక గిన్నెలోపోసుకుని బాగా కలుపుకోవాలి.
- Step 8
కూరలు ఉడికిన తర్వాత దించుకుని అందులో పైన చెప్పిన వా టన్నింటినీ కలిపేసుకుని స్టౌమీద పెట్టుకోవాలి.
- Step 9
2 లేదా మూడు నిమిషాలు అలా వుంచేసి దించేసుకోవాలి. ఒ క వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో పదార్థాన్ని వే యాలి. దానిపైన స్వీట్ పేస్ట్‌ని కొద్దిగా వేసుకోవాలి. ఇది తియ్యగా, కారంగా, పుల్లగా ఎంతో టేస్ట్‌గా వుంటుంది.\