- Step 1
పెనం మీద నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు-జీలకర్ర, సోంపు, అల్లం వెల్లుల్లి, ఇంగువ వేసి కలపాలి.
- Step 2
గోంగూర వేసి ఉడికాక, చిదిపిన బంగాళదుంప మిశ్రమం, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు, గరం మసాలా, కొబ్బరి పొడి వేసి కలిపి, ఉడికించాలి.
- Step 3
మైదా పిండిని పూరీ పిండిలా కలుపుకోవాలి. చిన్న చిన్న ముద్దలు చేసి, పూరీని ఒత్తాలి. దీంట్లో ఉడికించిన గోంగూర, బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి, కజ్జికాయ షేప్‌లో వచ్చేలా చేసి, చివరలు మూసివేయాలి.
- Step 4
ఇలా తయారుచేసుకున్న వాటిని, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా వేయించుకోవాలి. ఈ పకోడాలను వేడి వేడిగా వడ్డించాలి.