- Step 1
ముందుగా బియ్యం కడిగి పొడిపొడిగా అన్నం వండి పక్కన పెట్టాలి.
- Step 2
స్టవ్ మీద పాన్ పెట్టి ఎండిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. వీటిని మిక్సిలో వేసి మిక్సి పట్టాలి.
- Step 3
ఇవి మెత్తగా అయ్యిన తరువాత మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు, పసుపు కాస్త ఉప్పు వేసి మెత్తగా మిక్సి పట్టాలి.
- Step 4
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి రెండు టీ స్పూన్లు నూనె వేసి కాగిన తరువాత , మిక్సి వేసిన మామిడి మిశ్రమం వేసి పచ్చి వాసన పోయేవరకు వేపి, దానిలో వండిన అన్నం, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
- Step 5
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి మిగిలిన నూనె వేసి కాగిన తరువాత పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు, వేరుసెనగగింజలు వేసి వేగాక స్టవ్ ఆపి ఈ పోపును మామిడి, కొబ్బరి మిశ్రమం వేసి కలపాలి.