- Step 1
పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పెరుగు, కొబ్బరిపొడి ... వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 2
బంగాళదుంపలను చెక్కుతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెడల్పాటి పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు (గ్రైండ్ చేసినా పరవాలేదు) వేసి మెత్తబడేవరకు వేయించాలి.
- Step 3
ఇందులో పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మరో రెండు నిముషాలు వేయించి బంగాళదుంప ముక్కలు వేసి ఐదు నిముషాలు చిన్న మంటపై వేయించాలి.
- Step 4
ఇందులో గ్రైండ్ చేసిన మసాలా ముద్ద, తగినంత ఉప్పు, అరకప్పుడు నీళ్లు పోసి కలిపి మూతపెట్టాలి.
- Step 5
కూర ఉడికి నూనె తేలినప్పుడు గరంమసాలా పొడి కలిపి దింపేయాలి. ఈ ఖుర్మా పులావ్, నాన్, చపాతీలలోకి బావుంటుంది.