- Step 1
ముందుగా గోధుమ పిండిని జల్లి పెట్టుకొని అందులో తగినంత ఉప్పు వేసు కొని కలిపిన తర్వాత అందులో నీరు పోసి ముద్ద చేసుకోవాలి.
- Step 2
ఈ ముద్దను పక్కన పెట్టుకోవాలి.ముల్లంగిని తురమాలి. అందులో ఉన్న నీరంతా పోయేలా పిండి పక్కన పెట్టుకోవాలి. బాణలి పొయ్యి మీద పెట్టి ముల్లంగి లేత బంగారు రంగు వచ్చే వరకు వండాలి.
- Step 3
అందులో తగినంత ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి బాగా కలిపాలి. అది చల్లేరా దాకా పక్కన ఉంచాలి.
- Step 4
ముద్ద చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- Step 5
ఒక ఉండను తీసుకుని చిన్న పూరీలా వత్తి అందులో రెండు స్పూన్ల ముల్లంగి మిక్స్చర్‌ను ఉంచి దాన్ని మళ్ళీ ఉండగా చుట్టుకోవాలి.
- Step 6
తర్వాత దాన్ని జాగ్రత్తగా మందపాటి పరాటాలా ఒత్తుకోవాలి.
- Step 7
పెనం పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత పరాటాను దాని మీద కాల్చాలి. రెండువైపులా బంగారు రంగు వచ్చే దాకా కాల్చాలి. వేడి వేడిగా దానిపై వెన్న వేసి, సాస్‌తో వడ్డిస్తే ఎంతో ఇష్టంగా తింటారు.