- Step 1
ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పక్కనపెట్టాలి. చింతచుకురుకూడ శుభ్ర పరచుకుని ఉంచుకోవాలి.
- Step 2
యాలకులు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, గసాలు, మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి.
- Step 3
పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు వేయించాలి.
- Step 4
ఉల్లిముక్కలు వేగిన తరువాత టమాట పుదీన వేసి వేయించి చికెన్ వేసి ఉడికించాలి.
- Step 5
చికెన్ కొద్దిగ ఉడికిన తరువాత అందులో ముందుగా సిద్దం చేసుకున్న మసాలముద్ద, ఉప్పు, కారం, పసుపు, చింతచిగురు వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
- Step 6
చివరగా మసాల, కొత్తిమీర వేసి చికెన్ పూర్తిగా ఉడికిన తరువాత కూర దించాలి. అంతే ఎంతో రుచికరమైన చికెన్ చింతచిగురు కర్రీ రెడీ.