- Step 1
బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, అల్లంవెల్లుల్లిపేస్ట్, ఉప్పు, వాము వేసి బాగా కలపాలి.
- Step 2
బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి కలిపి పావుగంటసేపు నాననివ్వాలి.
- Step 3
తరవాత ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరవాత ఈ ముక్కలను అందులో వేసి గోధుమరంగువచ్చేవరకు వేయించి తీసేయాలి.
- Step 4
తరవాత అదే బాణలిలో ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
- Step 5
తరవాత ఉప్పు, పసుపు, మిరప్పొడి, గరంమసాలా, ధనియాలపొడి వేసి బాగా కలపాలి.
- Step 6
తరవాత వేయించి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి మంటను బాగా తగ్గించి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి.
- Step 7
చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అమృత్‌సర్ ఆలు పరాఠాలలోకి బావుంటుంది.