- Step 1
చికెన్ ముక్కలకు పెరుగు, ఉప్పు, మిరప్పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆవనూనె వేసి బాగా కలిపి అరగంట సేపు పక్కన ఉంచాలి.
- Step 2
పెనంలో వెన్న వేసి పెరుగు మిశ్రమంలో నానిన చికెన్ ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టాలి.
- Step 3
ఒక పాత్రలో కొద్దిగా నీరు పోసి జీడిపప్పు, బాదంపప్పులను ఉడికించి పేస్టు చేయాలి.
- Step 4
మరొక పాన్‌లో కొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
- Step 5
ఆ మిశ్రమం బాగా వేగిన తర్వాత టొమాటో ప్యూరీ, కాశ్మీరీ చిల్లీపౌడర్, ఉప్పు, మిరప్పొడి, గరం మసాలా పౌడర్, కసూరి మేథీ పౌడర్ వేసి బాగా కలిపి కొద్దిగా నీటిని పోసి ఉడికించాలి.
- Step 6
ఇవి ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత జీడిపప్పు, బాదంపప్పు పేస్టు వేసి ఉడికించాలి.
- Step 7
చివరగా రోస్ట్ చేసిన చికెన్ ముక్కలన, పైన కొద్దిగా వెన్న వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.
- Step 8
గిన్నెలోకి తీసుకున్న తర్వాత పైన ఫ్రెష్‌క్రీమ్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.