- Step 1
ఒక పాత్రలో శనగపిండి, సగం ఉల్లిపాయ ముక్కలు, చిదిమిన బంగాళదుంప, సగం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముక్కలు, పసుపు, జీలకర్ర, ఉప్పు, వాము వేసి తగినంత నీటితో ముద్దగా కలుపుకోవాలి.
- Step 2
ఈ మిశ్రమాన్ని చిన్న పకోడీలుగా చేసుకుని మరుగుతున్న నూనెలో వేసి వేయించి తీసి పక్కన పెట్టాలి.
- Step 3
మరొక పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేయాలి.
- Step 4
అవి వేగిన తర్వాత పెరుగు కలపాలి. అందులో మిరప్పొడి, పసుపు, ఉప్పు, ఇంగువ వేసి వేయించాలి.
- Step 5
ఈ మిశ్రమంలో ముందుగా వేయించి పక్కన ఉంచిన పకోడీలను వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.