- Step 1
కూరగాయల్ని తరిగి పెట్టుకోవాలి. జీడిపప్పు వేడి నీళ్లలో కొద్దిసేపు నానబెట్టి పేస్ట్‌లా రుబ్బుకోవాలి.
- Step 2
బాండీలో నూనె కాగాక జీలకర్ర, ఉల్లి ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి.
- Step 3
అందులోనే టమాటా ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కలపాలి.
- Step 4
క్యాప్సికమ్, బేబీకార్న్ ముక్కలు వేసి అరకప్పు నీళ్లు పొయ్యాలి. పది నిమిషాల తర్వాత జీడిపప్పు పేస్ట్, మెంతి ఆకు కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.
- Step 5
దించే ముందు పాలమీగడ, కొత్తిమీర వేసుకుంటే చాలు. బేబీకార్న్ క్యాప్సికమ్ కూర రెడీ. ఇది పరోటాల్లోకి చాలా బాగుంటుంది.