- Step 1
ముందుగా బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి వెచ్చబడ్డాక ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు, ఇంగువతో తాలింపు వేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న బీట్ రూట్‌ని పచ్చి వాసన పోయేదాక నూనెలో వేయించాలి.
- Step 3
ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, నానబెట్టిన చింతపండు గుజ్జు, ఇంతకు ముందు వేయించి ఉంచిన తాలింపు మొత్తం వేసి రుబ్బాలి.
- Step 4
ఈ పచ్చడిని ఒక కప్పులోకి తీసుకుని దానికి కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, కరివేపాకుతో తాలింపు వేసి కలుపుకోవాలి.
- Step 5
ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి చపాతీ పూరీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.